డ్రైవర్‌తో అక్రమ సంబంధం:భర్తను చంపించిన టెక్కీ భార్య

వీరికి 1994లో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. గిరికాంత్ మన్‌హటన్ రివ్యూ కోచింగ్ సెంటర్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఇతని వయస్సు నలభై ఎనిమిది. 39 ఏళ్ల అతని భార్య వాసంతి ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో డ్రైవర్ చైతన్యవర్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వాసంతి ఆ కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత కూడా డ్రైవర్ చైతన్యవర్మను కొనసాగించింది.
వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భర్త గిరికాంత్ భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో చైతన్యవర్మ కోసం తన భర్తను అఢ్డు తొలగించుకోవాలని ఆమె భావించింది. భర్తను చంపేందుకు కుట్ర పన్నింది. గత కొంతకాలంగా ఆమె ఓ ప్రయివేట్ చిట్ కంపెనీలో చిట్టి వేసింది. అందులో ఆమెకు రూ.40 లక్షలు రావాల్సి ఉంది. ఆ డబ్బులు ఎంతకూ ఇవ్వక పోవడంతో ఆమె తనకు తెలిసిన వారి ద్వారా ఆ డబ్బును రాబట్ట గలిగే బొల్లారంకు చెందిన సతీష్ అనే వ్యక్తికి ఆ పని అప్పగించింది.
అందుకు రూ.15 లక్షలు ఇస్తానని చెప్పింది. అదే సమయంలో తన భర్తను చంపితే మరో రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో సతీష్ మరో ఇద్దరిని కలుపుకొని ఈ నెల 10వ తేదిన గిరికాంత్ హత్యకు ప్లాన్ వేశారు. ఆ రోజున వాసంతి తన భర్త చైతన్యవర్మకు ఫోన్ చేసి బంధువులు వస్తున్నారని వారిని రిసీవ్ చేసుకోవడానికి ఓ స్థలంలో ఉండమని చెప్పింది.
అదే సమయంలో ముగ్గురు హంతకులు స్కార్పియోలో వెళ్లి గిరికాంత్‌ను బలవంతంగా ఎక్కించుకొని, టవల్‌ను మెడకు ఊపిరి ఆడకుండా బిగించి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కింద పడేసి దానిపై వాహనం ఎక్కించి ప్రమాదంగా చిత్రీకరించాలని భావించారు. సెల్ ఫోన్ పక్కనే ఉన్న చెరువులో పడేశారు. బిట్స్ వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ జరిపారు. దీంతో నిందితులు బయటపడ్డారు.












Click it and Unblock the Notifications