చైనా పర్యటన: చిక్కుల్లో రాష్ట్ర మంత్రి శైలజానాథ్

భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్ఐ)లో గతంలో ఆయన పనిచేశారు. చైనాలో వారం పాటు జరిగే యువజన వ్యవహారాలపై జరుగుతున్న వారం రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆయన చైనా వెళ్లారు. ఆయన చైనా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అయితే, వీలు కాలేదని అంటున్నారు.
అయినా శైలజానాథ్ ఈ నెల 8వ తేదీన చెన్నైకి వెళ్లి, మర్నాడు చైనాకు బయలుదేరి వెళ్లారు. చైనా విమానాశ్రయంలో దిగగానే తాను భారతదేశానికి చెందిన మంత్రినని ఆయన చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో చైనా అధికారులు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, శైలజానాథ్‌కు అనుమతి లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్లు తెలుస్తోంది.
అధికారిక హోదాలో పర్యటన చేస్తే దౌత్యపరమైన పాస్‌పోర్టును వాడుకోవడానికి వీలుంటుంది. శైలజానాథ్ విషయంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications