హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్ రాకెట్: తారా చౌదరికి నాంపల్లి కోర్టులో చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tara Chowdhary
హైదరాబాద్: వ్యభిచార కుంభకోణంలో అరెస్టయిన సినీ నటి తారా చౌదరికి బుధవారం నాంపల్లి కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. కాగా తనకు బెయిల్ ఇవ్వాలని తారా చౌదరి ఇటీవల నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం వరకు కోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అనంతరం ఈ రోజు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది.

ఉద్యోగాలు, సినిమాలలో అవకాశాల పేరుతో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి నెడుతోందనే ఆరోపణలపై తారా చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను, ఆమె భర్త ప్రసాద్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. వారిని తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.

కోర్టు తారా చౌదరిని, ప్రసాద్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. వారిని నాలుగు రోజుల పాటు విచారించిన పోలీసులు ఎన్నో కీలక ఆధారాలు సేకరించినట్లుగా వార్తలు వచ్చాయి. తారా లిస్టులో ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఇది సంచలనం రేపింది.

ఆ తర్వాత తారా చౌదరి తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు మంగళవారం వరకు వాదనలు విని, బుధవారం బెయిల్ పిటిషన్ కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది.

English summary
Nampally court rejected Tara Chowdary's bail petition on wednesday. Banjara Hills police arrest Tara Chowdary in a scam. After Police enquiry and she applied to bail in Nampally court. Today Court rejected petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X