వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లకార్డుపై జగన్‌కు కెటిఆర్ విరుగుడు, వైయస్‌పై ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
కరీంనగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఓ సూచన చేశారు. జగన్ గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నాడని, కాబట్టి ఆయనను తాము విశ్వసించమని చెప్పారు. అయితే ఎంపీ అయిన జగన్ తిరిగి ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ప్లకార్డు పట్టుకుంటే ఆయనను నమ్ముతామని చెప్పారు.

జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుంటే, ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు వెళ్లాలంటే పాసుపోర్టు కావాలా అని అన్నారని గుర్తు చేశారు. వీటిపై జగన్ క్షమాపణ చెప్పిన తర్వాతనే వరంగల్ జిల్లాలోని పరకాలలో అడుగు పెట్టాలని హెచ్చరించారు.

పరకాలలో తెరాస అభ్యర్థిని గెలిపించుకొని జగన్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణపై జగన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ ఇవ్వనని చెప్పినందున ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ప్రత్యేక కార్యాచరణకు దిగాలన్నారు.

కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరు ప్రాజెక్టును మళ్లీ ఎందుకు ప్రారంభిస్తున్నారని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డిలు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. పరకాలలో తెరాస విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కొండా సురేఖ వచ్చినా మరెవరు వచ్చినా తెలంగాణలో ఆంధ్రా పార్టీలకు స్థానం లేదని చెప్పారు. జగన్, తెలుగుదేశం పార్టీని, కాంగ్రెసు పార్టీని ఇక్కడ తిరస్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార ఎంపీలను పార్లమెంటు నుండి బహిష్కరించడం కేంద్రం అప్రజాస్వామిక తీరుకు నిదర్శనమన్నారు.

వందలాది మంది ప్రాణత్యాగాలకు కారణమైన కాంగ్రెసుకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. ఎంపీలు వెంటనే భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించాలని సూచించారు. పరకాలలో తెలంగాణ ప్రజలు తెలంగాణవాదం బలంగా వినిపిస్తారని ఆయన చెప్పారు.

కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయు జెఏసి ఆధ్వర్యంలో కాంగ్రెసు పార్టీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల అభిష్టాన్ని పార్లమెంటులో ప్రతిబింభిస్తున్న ఎంపీలను సభ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెసుపై ఓయు విద్యార్థులు ధ్వజమెత్తారు.

English summary
Telangana Rastra Samithi MLA Kalvakuntla Taraka Rama Rao suggested a remedy to YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy on Seemandhra placard in Parliament. He was blamed late YS Rajasekhar Reddy for his passport comments on Telangana in 2009 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X