కరెంట్ షాక్‌తో వరుడి మృతి: పెళ్లింట విషాదం

వెలుతూరి యాకయ్య (23)కు పక్క వూరి అమ్మాయితో ఉదయం పది గంటల 46 నిమిషాలకు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి మండపంలో యాకయ్య సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి తీస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి మరణించాడు. అతను అక్కడికక్కడే మరణించాడు. దీంతో పెళ్లి మండపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
గ్రామానికి గ్రామం విషాదంలో మునిగిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. పెళ్లయి హాయిగా కాపురం చేసుకోవాల్సిన యువకుడు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. యువకుడి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో పెళ్లి మండపం విషాదసాగరంగా మారింది.












Click it and Unblock the Notifications