మూడు రోడ్డు ప్రమాదాలు: 9 మంది దుర్మరణం

Kadapa Map
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో శనివారంనాడు తొమ్మిది మంది మరణించారు. కడప జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కడప జిల్లా రాజంపేట మండలం వెంకటరాజంపేట సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మరణించినవారు మెదక్ జిల్లా దుబ్బాక గ్రామానికి చెందినవారు. వీరంతా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.

కడప జిల్లాలోనే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం దిలసంచ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం చిన్నయ్యపాలెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఓ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+