గాలి, శ్రీలక్ష్మి పిటిషన్లను తోసిపుచ్చిన సిబిఐ కోర్టు

కాగా, గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే నెల 2వ తేదీన వాదనలు వింటామని కోర్టు తెలిపింది. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెత్మలానీ హాజరయ్యారు. అయితే, అడిషినల్ సొలిసిటర్ జనరల్ రానందున వాదనలకు సమయం కావాలని సిబిఐ కోరింది.
సిబిఐ అభ్యర్థనను మన్నించిన కోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. వాదనలను వాయిదా వేయవద్దని గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. సిబిఐ వ్యాఖ్యలు సరైనవి కావని, వాయిదా కోరడం సరి కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతివాదులు సీనియర్ న్యాయవాదులను దిగువ కోర్టులో వాదనలు వినిపించేందుకు ఎత్తుగడ అంటూ సిబిఐ తరఫు న్యాయవాది అన్నారు.
సిబిఐ తరఫు న్యాయవాది వ్యాఖ్యలను ప్రతివాదుల న్యాయవాదులు తప్పు పట్టారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి నిందితులు ఎవరైనా తమ తరఫున వాదనల కోసం నియమించుకునే హక్కు అందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications