దాసరి నారాయణ రావు కోడలికి మనోవర్తి: స్టే ఎత్తివేత

మనోవర్తి కోసం సుశీల 2002లోనే హైదరాబాద్ మెజిస్ట్రీట్ కోర్టును ఆశ్రయించారు. నెలకు రూ.వెయ్యి చొప్పున ప్రభు ఇవ్వాలని మెజిస్ట్రీట్ ఆదేశాలు ఇచ్చారు. ఇది చాలదని ఆమె జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఆ మొత్తాన్ని రూ.2,500కు పెంచింది. ఈ మొత్తాన్ని పెంచాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా మనోవర్తిని రూ.10వేలకు పెంచుతూ అనుకూల తీర్పు వచ్చింది.
అయితే ప్రభు తనకు మనోవర్తి చెల్లించడం లేదని, బకాయిలి ఇప్పించాలని అభ్యర్థిస్తూ సుశీల మళ్లీ మెజిస్ట్రీట్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు ప్రభుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. వీటిని సవాలు చేస్తూ ప్రభు అదనపు కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన జడ్జి కోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు. దీంతో ప్రభుపై కేసు విచారణతో పాటు సుశీలకు మనోవర్తి చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సుశీల హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పైన విచారణ చేపట్టిన న్యాయమూర్తి సెషన్స్ జడ్జి తీర్పును తప్పు పట్టారు.
పిటిషనర్ కోరిన విషయమేమిటో పరిశీలించకుండానే ఆదేశాలు ఇచ్చారని అన్నారు. వాటిని కొట్టివేస్తూ దిగువ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించారు. సుశీల భరణాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఇది చట్ట ప్రకారం ఏమాత్రం సమర్థనీయం కాదని, అందుకే ఫ్యామిలో కోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు జడ్జి చెప్పారు.












Click it and Unblock the Notifications