భూకబ్జాకు ప్రయత్నమంటూ జెసి తనయుడిపై ఫిర్యాదు

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - షరీఫ్‌తో పాటు మరో ఆరుగురు కలిసి 1993లో ఆషామల్లీఖాన్ వద్ద మాదాపూర్ సర్వే నెం.63, 68, 69, 70ల్లో ఉన్న 54 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. స్ధానికులు కొందరు ఆ భూమి తమదని కోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం కోర్టులో వివాదం జరుగుతోంది. కోర్టు ఈ భూమికి సంబంధించి ముఖీమ్‌కు డిక్రీ వచ్చింది.
ఈ స్థితిలో శనివారం మధ్యాహ్నాం 3 గంటల సమయంలో జెసి పవన్ రాజేంద్రనగర్‌కు చెందిన ఫిరోజ్‌ఖాన్, మరో 20 మందితో కలిసి వచ్చి జెసిబితో ఆ భూమిలో ఉన్న గోడలను కూల్చివేసి వాచ్‌మెన్‌న్ బెదిరించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నాం 1.30 గంటలకు తమకు ఫిర్యాదు అందిందని మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ జేమ్స్‌బాబు తెలిపారు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి, న్యాయనిపుణుల సలహా తీసుకుని పవన్ దోషిగా తేలితే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ జేమ్స్‌బాబు చెప్పారు.
ఈ విషయమై జెసి పవన్‌ను వివరణ కోరగా ఈ సంఘటనతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు ఓ తెలుగు దినపత్రిక రాసింది. ఆ స్ధలం గురించి గానీ, అదెవరిదనే విషయం గానీ తనకు తెలియదని, ఎందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని చెప్పారు. పైగా ఈ సంఘటన జరిగినప్పుడు తాను తాడిపత్రిలో ఉన్నానని చెప్పారు. ఎస్‌ఐ జేమ్స్‌బాబు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ముఖీమ్ ఫిర్యాదు మేరకు జిడి ఎంట్రీ చేసిన పోలీసులు డాక్యుమెంట్లను పరిశీలించి పవన్ దోషిగా తేలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications