తెలంగాణతో అట్టుడికిన లోకసభ, వెల్‌లోకి రాములమ్మ

K Chandrasekhar Rao-Vijayashanthi
న్యూఢిల్లీ: లోకసభ సోమవారం తెలంగాణ నినాదాలతో అట్టుడికి పోయింది. ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ఒక్కసారిగా లేచి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెంటనే చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని వారు తమ నిరసనలు తెలియజేశారు. వీరికి తోడుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎంపీలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కె చంద్రశేఖర రావు, విజయశాంతిలు జై తెలంగాణ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ ఎంపీలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆమె సూచనల మేరకు కాంగ్రెసు ఎంపీలు తమతమ సీట్లలో కూర్చున్నారు. కానీ కెసిఆర్, విజయశాంతిలు మాత్రం తమ నిరసనను కొనసాగించారు. ఓ దశలో వారు స్పీకర్ పోడియం వైపుకు దూసుకుపోయారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

తెలంగాణపై వెంటనే తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ కెసిఆర్, విజయశాంతిలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. గందరగోళం మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ముగించారు. కాగా తెలంగాణ ఎంపీలకు భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. సొంత పార్టీ నేతలు, నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ కోరుతున్నప్పటికీ దీనిపై సాగతీత ధోరణి సరికాదని కేంద్రానికి బిజెపి నేత సుష్మా స్వరాజ్ సూచించారు.

వెంటనే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని ఆమె అన్నారు. కేంద్రం బిల్లు పెడితే ప్రతిపక్ష పార్టీ అయిన తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు నాలుగు రోజుల తర్వాత మళ్లీ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. సభలో తెలంగాణ నినాదాలు చేస్తున్న వారిని స్పీకర్ గత వారం నాలుగు రోజుల పాటు బహిష్కరించిన విషయం తెలిసిందే.

కాగా తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు విప్ ధిక్కరించి సమావేశాలను బహిష్కరించారు. మరోవైపు కెసిఆర్, విజయశాంతిలు సభ నుండి వాకౌట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+