ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిల్ని ఎరగా వేసి: తారాచౌదరి తరహా వ్యవహారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

West Godavari District
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో తారా చౌదరి తరహా వ్యవహారం మరొకటి బయటపడింది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలకు అమ్మాయిలను ఎరగా వేసి ఆ తర్వాత వారిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారం బయటపడిందని ప్రముఖ తెలుగు ఛానల్ ఎన్టీవి ప్రసారం చేసింది. జిల్లాకు చెందిన విజయరత్నం అనే వ్యక్తి నందిని, కీర్తి అనే ఇద్దరు అమ్మాయిలను రాజకీయ నాయకులు, ప్రముఖులకు ఎరగా వేసి, వారి శృంగార కార్యకలాపాలను చిత్రీకరించారు.

ఆ తర్వాత వాటిని చూపించి వారి బ్లాక్ మెయిల్ చేసి వారి నుండి డబ్బులు వసూలు చేసే వారు. ఇలా వసూలు చేసిన డబ్బులు విజయరత్నం వద్ద భారీగా ఉన్నాయని తెలుస్తోంది. విజయరత్నం అకౌంట్‌లో కోట్లాది రూపాయలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన భార్య, స్నేహితుల అకౌంట్లలోనూ భారీగానే డబ్బులు ఉన్నాయని తెలుస్తోంది.

తన వ్యవహారం బయటపడటంతో విజయరత్నం అండ్ గ్యాంగ్ పరారీ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు కేంద్రంగా ఈ వ్యభిచార రాకెట్‌ను విజయరత్నం నడిపాడు. ప్రభుత్వ అధికారి లేదా రాజకీయ నాయకుడి ఫోన్ నెంబర్ తీసుకొని, ఓ అమ్మాయిచే సెక్సీగా మాట్లాడించడం, ఆ తర్వాత వారిని తమ ఉచ్చులోకి లాగడం చేసేవారు. ఇలా పలువురు విఐపిలను తమ ముగ్గులోకి వీరు లాగారు.

సుమారు 50 మంది వరకు అధికారులు వీరి ఉచ్చులో చిక్కుకున్నారట. తమ ఉచ్చులో ఇరుక్కున్న వారితో ఎలా వ్యవహరించాలి, వారి వీడియోలను సిసి కెమెరాలలో ఎలా చిత్రీకరించాలనే విషయంపై తన గ్యాంగ్ వారికి విజయరత్నం ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చేవాడు. మూడేళ్లుగా విజయరత్నం గ్యాంగ్ ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతోంది.

తమ వలలో చిక్కుకున్న వారి శృంగార కార్యకలాపాలను వారు చిత్రీకరించి, ఆ తర్వాత ఆ సిడిలను చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారైన విజయరత్నం వద్ద కీలక ల్యాప్ టాప్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ప్రముఖుల శృంగార సన్నివేశాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

కాగా ఈ కేసులో మంగళవారం సాయంత్రం ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

English summary
According to leading TV channel Tara Chowdary type scam revealed in West Godavari. Vijaya Ratnam, a video grapher was targeted VIPs like political leaders and officers. He used two girls to trap them. After trapping he collected money from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X