రాష్ట్రపతి అభ్యర్థిపై ఎన్డీఎలో లుకలుకలు, జెడి(యు) గుర్రు

బిజెపి ప్రధాన భాగస్వామ్య పార్టీ జనతాదళ్ - యునైటెడ్ బిజెపి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. బిజెపి సూచించే అభ్యర్థిని బలపరచబోమని జెడి - యు అంటోంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో బిజెపి ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల జెడి-యు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
బిజెపి ఏకపక్షంగా వ్యవహరిస్తే తాము కూడా అలాగే ఉంటామని, బిజెపి నిర్ణయాన్ని అంగీకరించబోమని జెడి - యు నేత ఒక్కరు అన్నారు. ఇదే విషయాన్ని జెడి- యు అధ్యక్షుడు శరద్ యాదవ్ చెప్పే అవకాశాలున్నాయి. తాము కాంగ్రెసు అభ్యర్థిని బలపరిచేది లేదని బిజెపి నేత సుష్మా స్వరాజ్ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీని ప్రతిపాదించినా, హమీద్ అన్సారీని ప్రతిపాదించినా తాము మద్దతు ఇవ్వబోమని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ఎన్నికలు జులైలో జరగనున్నాయి. రాష్ట్రపతిని ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు, రాష్టర్ శాసనసభల సభ్యులకు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శానససభల సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది.












Click it and Unblock the Notifications