చిరంజీవిపై రోజా పవన్ కళ్యాణ్ సినిమా డైలాగు

తిరుపతి ప్రజలకు 'ఆపద్బాంధవుడు'గా వచ్చానని చెప్పిన చిరంజీవి 'అపరిచితుడి'గా మారిపోయి రాజ్యసభ సీటు ఇచ్చేసరికి పారిపోయారని ఆమె అన్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని తరిమితరిమి కొట్టాలంటూ రోజా పిలుపునిచ్చారు. "ఈ ఎన్నికల్లో మీరు కొట్టే దెబ్బకు చిరంజీవికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి'' అన్నారు. తెలుగుదేశం నేతలకు కొట్టికొట్టీ తొడలు వాచిపోయాయని, ఇంక కొట్టడానికి ఏమీ లేదు, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఆమె అన్నారు.
తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి అరచేతిలో వైకుంఠం చూపుతున్నారన్నారు. అన్నీ ఫ్రీగా ఇస్తాను అంటూ 'ఫ్రీ చంద్రబాబు'గా మారిపోయారని, ఆయన ఎన్ని మాటలు చెప్పి నా జనం నమ్మరని ఆమె అన్నారు. పులివెందుల పులిబిడ్డ జగన్‌ను అత్యంత మెజారిటీతో ఆదరించాలని కోరారు.
కాగా, చదువుకునే రోజుల్లో వైఎస్ వద్ద పాకెట్‌మనీ తీసుకున్న రోజుల్ని మరచిపోయి చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. వేంకటేశ్వరస్వామి కొలువున్న తిరుపతి నియోజకవర్గాన్ని వదిలిపెట్టిన నీచాతినీచమైన వ్యక్తి చిరంజీవి అని సినీనటుడు విజయచందర్ అన్నారు.












Click it and Unblock the Notifications