వైయస్‌ను వీధిలోకి తెచ్చి: జగన్‌పై బొత్స, బాబుపై ఫైర్

మాది టిడిపిలా కుటుంబ పార్టీ కాదని చెప్పారు. జాతీయ దృక్పథంతో ఆలోచించే నేషనల్ పార్టీ అని చెప్పారు. పరిపాలనలో ఒక పద్ధతి, విధానం ఉంటుందని చెప్పారు. ఆ ఆలోచనతో, దృష్టితోనే మేం ముందుకు వెళతామని చెప్పారు. కుటుంబ పార్టీల మాదిరిగా కాంగ్రెసు నేతలు రాత్రికో మాట పగలో మాట చెప్పరన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఉప ఎన్నికల కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
చంద్రబాబు, జగన్ చేసే విమర్శలు రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. ఆత్మగౌరవంపై మీకు ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసునన్నారు. ప్రజల్లోని క్షణికావేశాన్ని కొందరు వాడుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ జయాపజయాల గురించి చూసే పార్టీ ఏమాత్రం కాదన్నారు. ఫలితాలు కాంగ్రెసుకు అనుకూలంగా వస్తాయని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దేవతే అన్నారు.
పార్టీకి చెందిన నేతలు ఇక నుండి బహిరంగంగా పరస్పర విమర్శలు చేసుకోరని బొత్స చెప్పారు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై నేతలందరితో మాట్లాడానని, ఇక నుంచి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా పార్టీలో చెబుతారన్నారు. ఏ దేశంలో అయినా, ఏ పార్టీలోనైనా పక్కవారు ఏం చేస్తున్నారో తెలుసుకునే వ్యవస్థ ఉండటం సహజమేనని బొత్స చెప్పారు.
సమ్మారావు వ్యవహారంలో గండ్ర వెంకట రమణ రెడ్డితో మాట్లాడానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని జగన్ వీధిలోకి తీసుకు వచ్చి వేలెత్తి చూపే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. కేవలం వైయస్ ఆస్తికే జగన్ వారసుడని, రాజకీయ వారసుడు కాదని బొత్స సత్యనారాయణ మరోమారు చెప్పారు.












Click it and Unblock the Notifications