హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం ఇస్తే తెలంగాణ ఓకే: సీమాంధ్ర టిడిపి, జగన్‌పై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి శుక్రవారం నిప్పులు గక్కారు. తిరుమలలో గోవింద నామ స్మరణ బదులు జై జగన్ నినాదాలు చేయడం దారుణమని బైరెడ్డి అన్నారు. జగన్, బ్రదర్ అనిల్ కుమార్, భూమన కరుణాకర్ రెడ్డి కలిసి రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. భూమన, జగన్, తిరుమల తిరుపతి దేవస్థానంను కూడా ఓఎంలాగే చూశారన్నారు.

వైయస్ జగన్‌ను గెలిపిస్తే తిరుమలలో వెంకన్న విగ్రహం దొంగిలించి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతారన్నారు. ప్రజలు స్వాతంత్రం కోసం పోరాడిన సమయంలో జగన్ తాత రాజారెడ్డి బ్రిటిష్ మిలటరీలో చేరారని ఆరోపించారు. శ్రీవారిని నల్లరాయితో పోల్చి చెప్పులు విసరాలన్న భూమన కరుణాకర్ రెడ్డికి వైయస్ టిటిడి చైర్మన్ పదవి కట్టబెట్టారన్నారు. కడప జిల్లాకు వైయస్ పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఆయన ఏమైనా అన్నమాచార్యుడా అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కుర్చీ ఎక్కడ ఊడిపోతుందో అనే భయంతోనే అవినీతిని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఎర్రన్నాయుడు విమర్శించారు. మద్యం తదితర కేసులలో అసలు దోషులను వదిలేసి అధికారులను బలి చేస్తున్నారన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుదేశం పార్టీ అందుకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. వైయస్ జగన్ అవినీతిని ఊరూరా ప్రచారం చేస్తామని చెప్పారు.

కాగా మహానాడులో ఉప ఎన్నికల అంశం, రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించినట్లు ఎర్రన్నాయుడు చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మహానాడును వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల తర్వాత మహానాడు తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ అంశంపై భేటీలో చర్చించలేదన్నారు.

మరోవైపు ఉప ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఉప ఎన్నికల తర్వాత తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇప్పిస్తామని ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు. చిదంబరంను బాబు కలిశారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. టిఆర్ఎస్, చిదంబరమే కుమ్మక్కయ్యారన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ కలిసి టిడిపిని భూస్థాపితం చేయాలని కుట్ర పన్నుతున్నాయన్నారు.

English summary
Telugudesam Party senior leader Yerram Naidu said on friday, TDP will accept central government decision on Telangana issue. He and Byreddy Rajasekhar Reddy lashes out at YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X