గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ బొత్సకు బినామీ: వర్ల

బొత్సకు గణేష్ బినామీ అన్నారు. బండ్ల గణేష్ తెలియదని బొత్స చెప్పగలరా అని సవాల్ విసిరారు. తీన్ మార్, శ్రీను వైట్ల సినిమాలకు బొత్స పెట్టుబడులు పెట్టలేదా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందన్నారు. కాంగ్రెసు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని ఎవరు రక్షించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులు ప్రాంతాల వారిగా పంచుకొని దోచుకున్నారని ఆరోపించారు.
వ్యాపారాలు పంచుకున్నారన్నారు. వైయస్ ప్రాంతానికి ఓ రాక్షసుడ్ని తయారు చేశాడని మండిపడ్డారు. కాంగ్రెసు పాలనలో కంచెనే చేనును మేస్తోందన్నారు. కాంగ్రెసు పాలనలో ఫిర్యాదుదారుడు పోలీసు స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేసే పరిస్థితి లేదన్నారు. గణేష్ బొత్స పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. బొత్స అండతోనే ఆయన ఫైనాన్షియర్లను బెదిరిస్తున్నారన్నారు. గణేష్ పైన ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. గణేష్ సినిమాలన్నింటికీ బొత్స డబ్బులు ఇచ్చారన్నారు.
ఇవి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి చెబుదామంటే ఆమెనే వివాదాల్లో కూరుకుపోయారన్నారు. తన తనయుడు అసాంఘీక శక్తులతో చేతులు కలిపారన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశాలపై దృష్టి సారించడం లేదని, కేవలం తన పదవిని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారన్నారు. సిబిఐ విచారణలో భాను కిరణ్ వెల్లడించిన రాజకీయ నేతలు, అధికారుల పేర్లు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా వర్ల రామయ్య బొత్సపై బండ్ల గణేష్ కురిపించిన ప్రశంసల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications