భాను కేసు: రామ్‌గోపాల్‌వర్మను విచారించనున్న సిఐడి

దీంతో రాం గోపాల్ వర్మను సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశముందని అంటున్నారు. రక్త చరిత్ర సినిమా కథ కోసం వర్మ సూరిని కలిసి వివరాలు సేకరించారు. ఈ సినిమాకు సి.కల్యాణ్ సమర్పకులు. అయితే కల్యాణ్ ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ వెనుక సూరి, భానులు పెట్టుబడులు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాం గోపాల్ వర్మకు త్వరలో నోటీసులు పంపించి విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.
రక్త చరిత్ర సినిమాకు కల్యాణ్ సమర్పకులు కాబట్టి, ఆ నిర్మాతకు భాను కిరణ్‌తో లింకులు బయటపడినందున వర్మను విచారిస్తే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశముందని సిఐడి పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనన తొమ్మిది రోజులు తమ కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు.
తొమ్మిది రోజుల పోలీసుల కస్టడీలో భాను కిరణ్ ఎన్నో విషయాలు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేసులో భాగంగా పోలీసులు భాను కిరణ్‌ను ఇటీవల మధ్య ప్రదేశ్‌లో అతను నివసించిన షియోనికి తీసుకు వెళ్లి విచారణ జరిపారు. భాను తెలిపిన వివరాల ప్రకారం సోదాలు నిర్వహించి రివాల్వర్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా భానును మరి కొన్ని రోజులు సిఐడి పోలీసులు తమ కస్టడీకి అడిగే అవకాశముంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications