హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలో లేను: చైర్మన్‌కు ఎస్వీ మోహన్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chakrapani
హైదరాబాద్: తాను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరలేదని, ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని శాసనమండలి సభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి మంగళవారం శాసన మండలి చైర్మన్ చక్రపాణికి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంపై ఎస్వీ ఉదయం చైర్మన్‌కు వివరణ ఇచ్చారు. శాసనమండలి సభ్యుడిగా తన గెలుపుకు గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సహాయం చేశారని చెప్పారు.

జగన్‌తో ఉన్న అనుబంధం కారణంగానే తాను అతనితో మాట్లాడుతున్నానని చెప్పారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పారు. ఒకవేళ తాను అలాంటివి చేసినట్లు చెబితే నిరూపించాల్సిన బాధ్యత పార్టీ పైనే ఉందని చెప్పారు. తాను ప్రభుత్వాన్ని కాని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కానీ మరే ఇతర పార్టీ నేతల పైన కానీ విమర్శలు చేయలేదని చెప్పారు. తాను ప్రస్తుతానికి కాంగ్రెసులోనే ఉన్నానని స్పష్టం చేశారు.

మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి, మాజీ మంత్రి శంకర రావుతో సహా పలువురు పార్టీ నేతలు ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శిస్తున్నారని చెప్పారు. వారు చేసేవి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కావా అని ప్రశ్నించారు. ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను జగన్ మద్దతుతో గెలిచానని చెప్పారు. ఆ అనుబంధం కొనసాగుతుందన్నారు.

కాగా ఎస్వీ మోహన్ రెడ్డికి శాసనమండలి చైర్మన్ ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావని, అనర్హత పిటిషన్ పైన వివరణ ఇవ్వాలని గతంలో నోటీసులు పంపారు. మోహన్ రెడ్డి వివరణ తీసుకున్న చైర్మన్ విచారణను 18వ తేదికి వాయిదా వేశారు. కాంగ్రెసు తరఫున పార్టీ విప్ శివ రామి రెడ్డి వాదనలు వినిపించారు.

English summary
MLC SV Mohan Reddy gave his clarification before legislative council chairman Chakrapani on Congress Party's disqualification petition. He said, he is not in YS Jaganmohan Reddy's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X