వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరకాలకు జగన్: కొండాసురేఖ, పార్టీలోకి మాజీఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
వరంగల్/మహబూబ్‌నగర్: పరకాల ఉప ఎన్నికలలో తన గెలుపు కోసం ప్రచారం చేసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోరన్ రెడ్డి వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ సోమవారం చెప్పారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని నందానాయక్ తండాలో ఆమె సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ వస్తే తెలంగావాదుల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని ఆమె చెప్పారు.

కాగా కాంగ్రెసు పార్టీకి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మాజీ శాసనసభ్యుడు చల్లా వెంకట్రామి రెడ్డి సోమవారం గుడ్ బై చెప్పారు. ఆయన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. సోమవారం కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనతో పాటు మరో 145 మంది తాజా, మాజీ ప్రతినిధులు రాజీనామా చేశారని చెప్పారు.

రాజీనామా లేఖలను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తామని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం పీఠమెక్కిన నేతలు ఆయన పథకాలను మరుగున పడేశారని ఆరోపించారు.

నిరుపేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు వారి దరి చేరడం లేదన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే 108, నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే 104 సేవలను మూలన పడేశారన్నారు. వైయస్ ఆశయ సాధన కోసం తాను జగన్ వెంట నడుస్తానని చెప్పారు. వైయస్ హయాంలో రైతులకు భరోసా లభించిందని ఏళ్ల తరబడి అప్పుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రుణమాఫీతో విముక్తులు చేశారన్నారు.

English summary
YSR Congress Party leader Konda Surekha said, party chief and Kadapa MP YS Jaganmohan Reddy will campaign in Parkal of Warangal for her winning in upcoming bypolls.
 Alampur former MLA of Mahaboobnagar district Challa Venktrami Reddy was resigned to Congress Party. He said, He will join in YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X