రెచ్చిపోయిన మావోలు: ఏఎస్ఐ కిడ్నాప్, దారుణ హత్య

అనంతరం అతనిని దారుణంగా కాల్చి చంపారు. ఇతను దరంభాద్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ విషయంపై అంతకుముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) మన్మోహన్ ప్రహరాజ్ మాట్లాడుతూ.. ఏఎస్ఐ కిడ్నాప్‌కు గురయ్యారని చెప్పారు. అతనిని మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు.
దరంభాద్ పోలీస్ ఔట్ పోస్టులో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న కృపారాం సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌కు తీసుకు వెళుతున్న వాటర్ ట్యాంక్‌కు ఎస్కార్ట్‌గా ఉన్నాడు. ఆ సమయంలో గౌదా వద్ద పదిమంది మావోయిస్టులు వాటర్ ట్యాంకర్‌ను, అతనిని అడ్డుకున్నారు. అతనిని తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
కృపారాంను తమతో తీసుకు వెళ్లి కాల్చి చంపారు. అయితే అధికారికంగా ఇంకా మావోయిస్టులు కాల్చి చంపినట్లు ప్రకటించాల్సి ఉంది. ఇటీవల ఇద్దరు విదేశీయులను, ఓ ఐఏఎస్‌ను, ఓ ఎమ్మెల్యేను ఒడిషా, చత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications