వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాపర్ క్రాష్: జార్ఖండ్ ముఖ్యమంత్రికి తప్పిన ప్రమాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Arjun Munda
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండాకు పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి ఖరస్వాస్ నియోజకవర్గం నుంచి హెలికాప్టర్‌లో తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలికాప్టర్‌ను హఠాత్తుగా రాంచీలోని విమానాశ్రయంలో దించివేశారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రికి అర్జున్ ముండాకు, ఆయన భార్య మీరా మండాకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని రాంచీలోని ఓ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.

సిఎం, ఆయన భార్యతో పాటు మరో ముగ్గురు కూడా ఈ హెలికాప్టర్‌లో ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం 12.25 నిమిషాలకు రాంచీలోని బిర్సా ముండా ఎయిర్ పోర్టులో హెలికాప్టర్ దిగింది. అయితే పైలట్ దానిని ల్యాండింగ్ చేస్తుంగా కాస్త క్రాష్ అయింది. దీంతో వారందరూ గాయపడ్డారు. ముండాకు స్వల్ప గాయాలయ్యాయి.

వారిని దగ్గరలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. ముఖ్యమంత్రిని ఐసియులో ఉంచారు. పరీక్షలు జరిపిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముండా కాలు, చేతికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. వివరాల ప్రకారం పైలట్ రెండుసార్లు హెలికాప్టర్‌ను సేఫ్‌గా లాండ్ చేయడంలో విఫలమయ్యాడు.

మూడోసారి ల్యాండింగ్ చేస్తున్న సమయంలో రన్ వేకు ఎనిమిది ఫీట్ల ఎత్తులో ఉన్న సమయంలో ఈ క్రాష్ చోటు చేసుకుంది. ఈ హెలికాప్టర్‌లో ముండా, అతని భార్య, వ్యక్తిగత కార్యదర్శి, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. సిఐఎస్ఎఫ్ వెంటనే స్పందించి చర్యలకు ఉపక్రమించారు.

English summary
A Pawan Hans helicopter carrying chief minister, Arjun Munda, wife Meera and three others crash landed at the Birsa Munda airport around 12.25 pm today. All on board the chopper are safe but have sustained injuries for which they are being treated at the Apollo hospital near here. Munda has reportedly fractured an arm and has injuries on his leg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X