జగన్ గూర్చి తెలుసు, నేటి హీరో రేపటి విలన్: చిరంజీవి

వచ్చే ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. రాజకీయాలు అంటే సినిమా కాదని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయే లబ్ధి పొందుతుందన్నారు. తెరవెనుక రాజకీయాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. నేటి హీరో రేపటి విలన్ అన్నారు.
కాగా కాంగ్రెసు పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను జగన్ తన పార్టీ జెండాలో పొందుపరుచుకున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబ నాయుడు వంచనకు మారుపేరు అన్నారు. మోసపూరిత మాటలతో ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. జగన్ పార్టీకి సిద్ధాంతాలు లేవని ఆయన ఏ ఉద్దేశ్యంతో పార్టీ పెట్టారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అక్రమ సంపాదనతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జగన్, చంద్రబాబులపై ఆరోపణలు చేశారు. పార్టీలకు వ్యక్తుల కన్నా విధానాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసుకు దశ దిశ లేదన్నారు. కాంగ్రెసు అజెండాను తన జెండాలు కలుపుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో రైతు చైతన్య యాత్రలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే కాంగ్రెసు ధ్యేయం అన్నారు. రైతులకు పెట్టుబడులు తగ్గించి ఆదాయవనరులు పెంచేందుకు సబ్సిడీలు ఇస్తున్నట్లు చెప్పారు. రూ.8వేల కోట్లతచో ఉపాధి హామీ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రైతులున్ని సమాయత్తం చేసేందుకే రైతు యాత్రలు అన్నారు.
వంద రోజుల ఉపాధి పనులు పూర్తి చేసిన కూలీలకు 200 రోజులు పనులు ఇస్తామన్నారు. పోలవరం ఒక్క ఆంధ్రది కాదన్నారు. అన్ని ప్రాంతాలకు చెందుతుందన్నారు. ప్రభుత్వానికి సహకరించే వాళ్లు సహకరించండి లేదంటే ఇంట్లో కూర్చొండన్నారు. పోలవరంపై కోర్టుకు వెళ్లి స్టే ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. చేవెళ్ల - ప్రాణహిత జాతీయ హోదా కోసం కృషి చేస్తున్నామన్నారు. అలా అయితే 90 శాతం నిధులు కేంద్రం నుండి వస్తాయన్నారు.
రైతులకు కాంగ్రెసు ఎంతో చేసిందని, ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. గిట్టుబాటు ధరల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. పాలమూరుకు నెల రోజుల్లో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. డిగ్రీ చదవిని వారికి ఎంత జీతం వస్తుందో రైతులకు అలా గిట్టుబాటు ధర అయ్యేలా తాము చూస్తామన్నారు. కాగా పాలమూరులో కిరణ్ ట్రాక్టర్, ఎద్దుల బండి ఎక్కి కనువిందు చేశారు.












Click it and Unblock the Notifications