తాళమేస్తే పగులగొడ్తానని శంకరరావు హెచ్చరిక

బుధవారం ఉదయం సిఎల్పీ కార్యవర్గం సమావేశమైంది. పార్టీ నాయకులు సిఎల్పీకి వచ్చి మీడియా సమావేశాలు జరిగే గదిలోకి ప్రవేశించి, మీడియాతో మాట్లాడడం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తోంది. అయితే, నాయకులు ఈ గదిలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేయడం కొంత మంది శాసనసభ్యులకు నచ్చడం లేదు. పైగా, ముఖ్యమంత్రి సిఎల్పీ నాయకుడిగా ఉన్నారు.
సిఎల్పీలో ఏర్పాటు చేసే మీడియా సమావేశాల్లో ప్రభుత్వాన్ని గానీ ముఖ్యమంత్రిని గానీ విమర్శించకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని సిఎల్పీ నిర్ణయం తీసుకుంది. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా అనుమతి తీసుకోవాలని కూడా ఆదేశించింది. తాము ఏం మాట్లాడాతారో కూడా సిఎల్పీకి వివరించాలని సూచించింది.
పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేయకూడదని సిఎల్పీ కార్యవర్గం మాజీ మంత్రులను, ముఖ్యంగా శంకరరావును కోరినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని శంకరరావు వద్ద చెప్పినప్పుడు - తాను వచ్చి ఇదే గదిలో మాట్లాడుతానని, తాళం వెసి ఉంటే పగులగొడతానని అన్నారు. తనను ఎవరూ అడ్డగించలేరని ఆయన అన్నారు.
కాగా గురువారం శంకర రావు సిఎల్పీ కార్యాలయానికి చేరుకొని జై సోనియా గాంధీ అని నినాదాలు చేస్తూ సిఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు.












Click it and Unblock the Notifications