ఎవరైనా నన్నెందుకు అరెస్టు చేస్తారు: వైయస్ జగన్

YS Jagan
అనంతపురం: ఎవరైనా తననెందుకు అరెస్టు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాను చేసిన తప్పేమిటని ఆయన అడిగారు. రాజకీయంగా తాను వేరే వైఖరి తీసుకున్నంత మాత్రాన తన ప్రతిష్టను దెబ్బ తీసే స్వేచ్ఛ వారికి వచ్చేస్తుందా అని ఆయన అడిగారు. సిఎన్ఎన్ - ఐబిఎన్, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే, ఎన్డీటివీలకు ఆయన బుధవారం ఇంటర్వ్యూలు ఇచ్చారు.

చట్టానికి కట్టుబడి పౌరునిగా సిబిఐ సమన్లపై కోర్టుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని ఆయన అన్నారు. కోర్టుకు వెళ్తామని, తమ వాదనలు వినిపిస్తామని ఆయన అన్నారు. సిబిఐ తీరులో రాజకీయ స్వభావమే దాగి ఉందని ఆయన విమర్శించారు. పోరాడుతున్నది తాను కాదని, వాళ్లే తనపై దాడి చేస్తున్నారని, వారి చేతిలో అధికారం ఉందని, దాని అండతో తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. దేవుడు తన వైపు ఉన్నాడని, ప్రజలు తన వైపు ఉన్నారని, రాష్ట్రంలో విపక్షంగా తాను కాంగ్రెసుపై పోరాడుతున్నానని ఆయన అన్నారు.

కాంగ్రెసులోకి తిరిగి వెళ్లే ప్రశ్నే తలెత్తదని, అది ముగిసిన అధ్యాయమని ఆయన అన్నారు. ఇది ధర్మపోరాటమని, సాక్షి కుటుంబం మొత్తం ముందుండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్తుందని ఆయన అన్నారు. ఇలాంటి స్థితిలో సాక్షి సర్క్యులేషన్ పడిపోదని, మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటారని ప్రశ్నిస్తే అలా సంఖ్య చెప్పదలుచుకోలేదని, ఉప ఎన్నికల ఫలితాలను మీరే చూస్తారు కదా అని ఆయన అన్నారు. 18 అసెంబ్లీ స్థానాల్లో, ఓ లోకసభ స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, అంటే మొత్తం 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలే న్యాయనిర్ణేతలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసునని, దాని ప్రకారమే ఓటేస్తారని, దేవుడు తన వైపు ఉన్నాడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+