ఎసిబికి చిక్కిన ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్

రీసెర్స్ స్కాలర్ బానోతు చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు వల వేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బాషా కార్యాలయంలోనే అతన్ని పట్టుకున్నారు. రీసెర్స్ స్కాలర్ నుంచి 20 వేల రూపాయలు తీసుకుంటున్న సమయంలో ఎసిబి అధికారులు పట్టుకున్నారు. లంచం ఇవ్వకపోతే పరిశోధనలో ఇబ్బందులు ఎదుర్కుంటావని చాంద్ బాషా పరిశోధక విద్యార్థిని భయపెట్టాడు.
హైదరాబాదులోని బోరబండకు చెందిన చాంద్ బాషా 2007 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మైక్రోబయోలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన రూ.1.5 కోట్ల నిధులతో చాంద్ బాషా ముగ్గురు పరిశోదక విద్యార్థులను నియమించుకున్నాడు. వారికి నెలక 18 వేల రూపాయలు చెల్లిస్తున్నాడు. వారిలో ఇద్దరు పిహెచ్‌డి విద్యార్థులున్నారు.
పరిశోధక విద్యార్థులు స్టయిఫండ్ పొందడం ప్రారంభిచినప్పటి నుంచి బాషా వారి నుంచి నెలకు ఆరు వేల రూపాయలేసి తీసుకుంటూ వస్తున్నాడు. ఐదు నెలల క్రితం దాన్ని పది వేల రూపాయలకు పెంచాడు. 15 రూపాయలేసి తనకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండడంతో పరిశోధక విద్యార్థులు ఎసిబిని సంప్రదించారు. స్టయిఫండ్ వారి బ్యాంకుల్లో జమ కాగానే రూ. 20 వేలు తన ఖాతాలో జమ చేయాలని బెదిరిస్తూ వచ్చాడు. తాను ఇల్లు కట్టుకుంటున్నానని తనకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని అతను పరిశోధక విద్యార్థులను డిమాండ్ చేస్తూ వచ్చాడు.












Click it and Unblock the Notifications