సాక్షికి సంబంధం లేదు: మీడియా స్వేచ్ఛపై చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: సాక్షిపై చర్యలకు, మీడియా స్వేచ్ఛకు ఎలాంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఉప ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన ఒంగోలులో విలేకరులతో మాట్లాడారు. అవినీతిపై పోరాటం చేయాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని అన్నారు. అవినీతి సొమ్ముతో పుట్టిన సాక్షి పత్రిక, టివిలను ఎవరూ సమర్థించరని ఆయన అభిప్రాయపడ్డారు.

బలహీన వర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేత బంగారు లక్ష్మణ్ జైలుకు వెళితే ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో దౌర్జన్యాలు, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. దీంతో రాష్ట్ర ప్రతిష్ట మంటగలిసి పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో దక్షిణ భారత దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

అభ్యర్థులను ఖరారు చేశాక పార్టీలో చర్చించి ఆ తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు. ఇతర పార్టీలతోనూ చర్చిస్తానని చెప్పారు. ఒంగోలు పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన పార్టీ బలోపేతానికి సూచనలు చేయాలని కోరారు. కాగా బుధవారం జగన్ పైన చంద్రబాబు గుంటూరు జిల్లా ప్రచారంలో తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే జైలుకే వెళ్తారని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు పైస్థాయిలకు చేరుకున్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఐఎఎస్ అధికారులు చంచల్‌గుడా జైలుకు వెళ్లారని, విశ్వసనీయత అంటే అదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వెంట నడిస్తే హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరూ కాపాడే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. రాష్టంలో సమస్యలు చాలా ఉన్నాయని, అన్ని రంగాలవారు సమస్యలు ఎదుర్కుంటున్నారని, రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన అన్నారు. రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుందని, తన చివరి రక్తం బొట్టు వరకు రైతుల కోసం పనిచేస్తానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+