వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో గ్యాస్ లీక్, దుర్వాసన: ఎసి మెషిన్ల నుండే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajya Sabha
న్యూఢిల్లీ: రాజ్యసభలో గురువారం గ్యాస్ లీకైంది. గ్యాస్ లీక్ కావడంతో శాసనమండలి చైర్మన్ సభను పన్నెండున్నర గంటల వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభమయ్యాక ఒక్కసారిగా కుళ్లిపోయినగా దుర్వాసన వచ్చింది. గ్యాస్ లీకై దుర్వాసన వచ్చినట్లు సభ్యులు గుర్తించారు. వెంటనే చైర్మన్‌కు చెప్పారు. మొదట పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత పన్నెండు గంటల వరకు సభను వాయిదా వేశారు.

గ్యాస్ లీకై దుర్వాసన రావడంతో సభ్యులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఎసి మెషీన్లు లీకై దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్, వ్యవస్థ కుళ్లి పోయింది.. రాజ్యసభలోనూ కుళ్లిన వాసన వస్తోందని చలోక్తి వేశారు. రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర ప్రసాద్ దుర్వాసన వస్తున్నట్లుగా మొదట గుర్తించారు.

ఐదు నిమిషాలు పాటు అంతా గమనించి, ఆ తర్వాత వీరేంద్ర ప్రసాద్ దుర్వాసన వస్తున్నట్లు చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పదకొండు గంటల ఇరవయ్యేడు నిమిషాలకు చోటు చేసుకుంది. ఇంతకుముందు నాలుగు రోజుల క్రితం సోమవారం కూడా లోకసభలో ఇలాంటి పరిస్థితి సంభవించింది. అయితే ఆ సమయానికి అప్పటికే లోకసభ అయిపోయింది. సభ్యులు వెళ్లి పోయారు.

సభలోని ప్రతి ఒక్క సభ్యుడికి ఏదో చెడు వాసనలా అనిపించిందని, అయితే దానికి కారణం మాత్రం ఎవరికీ తెలియలేదని, దీంతో సభను వాయిదా వేయడమే మంచిదని రాజ్యసభ చైర్మన్ చెప్పి సభను వాయిదా వేశారని సిపిఐ నేత డి.రాజా చెప్పారు.

English summary
The Rajya Sabha has been adjourned following complaints about a gas leak. Some people in the officials' gallery had complained to the Public Works Department about a foul smell from the sewage system.
 "Everyone felt some foul smell. We didn't know the cause, so the Speaker said it was better to adjourn the House for some minutes," CPI leader D Raja said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X