వైయస్ జగన్‌పై సానుభూతి పెరుగుతుందా?

సిబిఐ విచారణ ఉద్దేశ్యాన్ని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు తప్ప చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వైయస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలకూడదనే ఉద్దేశంతో ఉన్నాయి. ఇందులో భాగంగనే సిబిఐ అడుగులు వేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు విమర్శిస్తున్నారు. అయితే, సిబిఐ చర్యలు 18 శాసనసభా స్థానాలకు, లోకసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో జగన్‌కు ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు.
రాజకీయాల్లో వైయస్ జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిన అనివార్యమైన స్థితిలో కాంగ్రెసు పార్టీ పడింది. ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ హవా నడిస్తే భవిష్యత్తులో తాము కోలుకోవడం కష్టమనే అభిప్రాయం కాంగ్రెసు పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇక, 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తమను నష్టపరిచిన విధంగానే వైయస్ జగన్ పార్టీ నష్టం చేస్తుందనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. దీంతో రెండు పార్టీలు కూడా వైయస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో గత కొంత కాలంగా మీడియా వార్ కూడా నడుస్తోంది. గతంలో ఏకపక్ష వాదన వినిపిస్తూ వస్తున్న మీడియాకు సాక్షి మీడియాతో ఎదురుదాడి ప్రారంభమైంది. సిబిఐ సాక్షి మీడియా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై వ్యతిరేకత ఎదురు కావడానికి ఇది కూడా ఒక కారణం. సాక్షి మీడియా ఖాతాలను స్తంభింపజేయడానికి, పత్రికా స్వేచ్ఛకు ఏ విధమైన సంబంధం లేనప్పటికీ వైయస్ జగన్ మద్దతు పొందగలగడానికి మీడియా వార్ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మొత్తం మీద, సిబిఐ చర్యల వల్ల జగన్‌కు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందనే వాదన మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications