ముగ్గురు మొనగాళ్లు!: జగన్‌పై దూకుడు, వైయస్‌పై చిరు

కానీ మూడు నాలుగు రోజులుగా జగన్ పైన వీరి దూకుడు మరింత పెరిగింది. మూడు రోజుల క్రితం నర్సాపురం ఉప ఎన్నికల ప్రచార సభ నుండి కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు అధినేతపై విమర్శలు ప్రారంభించారు. ఆ విమర్శల జోరు రోజు రోజుకు పెరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను ప్రభుత్వం ఎక్కడా తుంగలో తొక్కలేదని, జగన్ కేవలం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మొదట కిరణ్ సాఫ్ట్ విమర్శలు ప్రారంభించారు. ఆ తర్వాత దూకుడు పెంచారు.
ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వైయస్ బద్ద శత్రువు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతతో చేతులు కలిపారని విమర్శలు చేశారు. తాజాగా శుక్రవారం తిరుపతిలో జరిగిన ప్రచార సభలో కిరణ్ బొత్స, చిరంజీవిల కంటే ఓ అడుగు ముందుకేశారు. జగన్‌కు పదవి పైన మోజు పుట్టిందని, ఆశ ఉండటం తప్పు కాదని, అయితే దానికి సమయం, సందర్భం ఉంటుందని, అప్పటి వరకు ఆగాల్సి ఉంటుందన్నారు.
కానీ జగన్ మాత్రం సమయం కోసం చూడకుండా అప్పటికప్పుడే పీఠం ఎక్కాలని ఉవ్వీళ్లూరుతున్నారన్నారు. అంతటితో ఆగకుండా తుపాకులు రవాణా చేస్తున్న వారితో, హంతకులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేరస్థులతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం సరికాదన్నారు.
చిరంజీవి కూడా రెండు రోజులుగా జగన్ పైన విరుచుకు పడుతున్నారు. గురువారం న్యూఢిల్లీలో మాట్లాడిన ఆయన.. జగన్ గురించి ప్రజలకు అందరికీ తెలుసునని, నేటి హీరో రేపటి విలన్ అని జోస్యం చెప్పారు. ఉప ఎన్నికలలో ప్రజలు జగన్‌కు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. రాజకీయాలు అంటే సినిమా కాదన్నారు. ఆయన చేసే తెరవెనుక రాజకీయాలు అందరికీ తెలుసన్నారు.
శుక్రవారం కిరణ్, బొత్స పాల్గొన్న సభలో చిరంజీవి పరోక్షంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో వలె కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో భూపందేరాలు లేవని చిరు అన్నారు. ఆయన అన్న ఈ మాటలు దివంగత వైయస్‌ను ఉద్దేశించే అనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కొందరు రకరకాల పేర్లు చెప్పి వెంకటేశ్వర స్వామి సొమ్ము దోచుకున్నారన్న వ్యాఖ్యలు కూడా వైయస్ వర్గాన్ని ఉద్దేశించే అని అంటున్నారు.
ఇక పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మొదటి నుండి జగన్ విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు జగన్, ఆయన పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగానే తిప్పు కొడుతున్నారు. జగన్‌కు చెందిన సాక్షి మీడియా ఖాతాల స్తంభనను కూడా ఆయన గట్టిగానే సమర్థించారు.












Click it and Unblock the Notifications