గౌహతిలో భూకంపం: షిల్లాంగ్, కోల్‌కత్తాల్లో ప్రకంపనలు

దాదాపు 10 నుంచి 15 సెకన్ల వరకు భూమి కంపించింది. గౌహతిలో ఇళ్లు స్వల్పంగా దెబ్బ తిన్నట్లు సమాచారం. ఇల్లు కూలడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. భూకంపంతో భయానికి లోనైన ప్రజలు ఇళ్ల నుంచి రోడ్ల మీదికి పరుగులు తీశారు.
ఈశాన్య భారతదేశంలో భూకంపం ప్రభావం కనిపించింది. భూకంప తీవ్రత సాధారణంగానే ఉందని అధికార వర్గాలు చెప్పాయి. 2011 సెప్టెంబర్‌లో ఈశాన్య భారతదేశంలో భూకంపం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎనిమిది మంది మరణించారు. పొరుగుదేశం నేపాల్‌ను కూడా ఆ భూకంపం తాకింది. నేపాల్‌లో ఐదుగురు మరణించారు.
ఇటీవల భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. దేశంలోని హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆంధ్ర, తమిళనాడు వంటి పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications