శంకర్ దాదా దెబ్బకు తెరుచుకున్న తలుపులు

తన హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ స్పీకర్‌కు శంకరరావు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. శంకరరావు వాదనను తిప్పికొట్టడానికి శానససభ్యుడు కె. లక్ష్మారెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేశారు. అయితే, పరిస్థితి చేయి దాటిపోతుందనే ఉద్దేశంతో శనివారం మీడియా గది తాళాలు తీసినట్లు తెలుస్తోంది. దీంతో మీడియా గదిలో శంకరరావు శనివారం మీడియాతో మాట్లాడారు.
తానెప్పుడూ వాస్తవాలే మాట్లాడుతానని శంకరరావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి తాను వాచ్ డాగ్‌నని ఆయన చెప్పుకున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు మాట్లాడినా తాను ఊరుకోనని ఆయన అన్నారు.
అంబేడ్కర్‌పై వచ్చిన కార్టూన్‌ను ఆయన వ్యతిరేకించారు. అంబేడ్కర్‌కు తానే భారతరత్న ఇచ్చానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. అంబేడ్కర్‌కు ఎవరి కితాబు అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేవారిని ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన చెప్పారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎవరితోనూ మ్యాచు ఫిక్సింగ్ చేసుకోలేదని, అవినీతికి పాల్పడితే సొంత కుమారుడినైనా వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications