వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరకాల బరిలో కెయు జెఏసి, తెరాస నుండి 'రెడ్డి'?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal District
వరంగల్: తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుండి కాకతీయ విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి(కెయు జెఏసి) పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కాకతీయ విశ్వవిద్యాలయంలోని పది విద్యార్థి సంఘాలు ఆదివారం భేటీ అయ్యాయి. పరకాల నుండి పోటీ చేసేందుకే అన్ని విద్యార్థి సంఘాలు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం.

పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలో పోటీ చేయడం వారిని అసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరుపార్టీలో పార్టీల ప్రయోజనాల కోసం బరిలోకి దిగితే తెలంగాణవాదం బలహీనపడుతుందని కాకతీయ జెఏసి ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలకు చెక్ చెప్పి నేరుగా తామే బరిలోకి దిగాలని యోచిస్తున్నాయని తెలుస్తోంది.

కాగా పరకాల టిక్కెట్‌ను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు నిర్ణయించినట్లుగా సమాచారం. సహోదర రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ ఎన్నికల సంఘం నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే సహోదర రెడ్డిని అధికారికంగా ప్రకటించే ముందు ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలు తెరాస ఎన్నికల కమిటీ చేస్తోందని తెలుస్తోంది.

కాగా పరకాల నియోజకవర్గంలో పోటీలో నిలిచే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బిజెపి, తెరాస పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మాజీ డిఎస్పీ నళిని కూడా తెలంగాణ కోసమే తాను రాజీనామా చేశానని, తాను ఖచ్చితంగా బరిలోకి దిగుతానని చెబుతోంది. తాజాగా కాకతీయ జెఏసి బరిలోకి దిగేందుకు భేటీ కావడం గమనార్హం.

పరకాలలో బిజెపి, తెరాస ఒకరిపై మరొకరు పోటీ చేస్తే తెలంగాణవాదం ఓడే అవకాశముందని, దీనిపై ఆ పార్టీలో ఆలోచించుకోవాలని తెలంగాణ జెఏసి సూచించింది. శనివారం జరిగిన జెఏసి సమావేశంలో పోటీ నుండి తప్పుకోవాలని బిజెపికి సూచించారు. అయితే అందుకు బిజెపి ససేమీరా అంది. తెరాస ఈ భేటీకి హాజరు కాలేదు. అయితే పోటీలో ఒక్కరే ఉండేందుకు తాము ఇంకా ప్రయత్నాలు చేస్తున్నామని జెఏసి చైర్మన్ కోదండరం చెప్పారు.

English summary
It is said that, Kakatiya JAC is thinking to contest from Parkal of Warangal district in upcoming bypolls. JAC organized a meeting with students union on Sunday. Student JAC is unhappy with Telangana Rastra Samithi and Bharatiya Janatha Party for contesting from same constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X