హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు కూతురింట్లో డబ్బుపై ఫిర్యాదు చేస్తే..: భన్వర్‌ లాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanwar Lal
హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూతురు సుస్మిత నివాసంలో దొరికిన డబ్బుపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక కథనాలపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల నోటిఫికేష్ వెలువడిన అనంతరం పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

చెన్నైలోని చిరంజీవి కూతురు సుస్మిత నివాసంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు చేసిన దాడిలో రూ. 35 కోట్ల రూపాయలు దొరికిన విషయం తెలిసిందే. ఆ డబ్బులు చిరంజీవికి చెందినవేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులపై చిరంజీవి వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ డబ్బులతో గానీ తన వియ్యంకుడి నివాసంలో ఐటి దాడులకు గానీ తనకు ఏ విధమైన సంబంధం లేదని చిరంజీవి స్పష్టం చేశారు.

అన్ని వాహనాలతో పాటు మీడియా వాహనాలను కూడా క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించిటన్లు భన్వర్‌లాల్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి జూన్ 12వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భన్వర్‌లాల్ ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీలను అరికట్టడానికి ఆయన చర్యలు తీసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చేవారిపైనా, తీసుకునేవారిపైనా చర్యలుంటాయని ఆయన ఇది వరకు చెప్పారు. పోలీసులు ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో డబ్బులు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారాలపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.

English summary
State Election officer Bhanwar Lal said that they will see on money seized by IT officers in Congress Rajyasabha member Chiranjeevi's daughter Sushmita's residence, is some body make complaint. He said that they will see on the complaints made against Sakshi daily reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X