హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస అభ్యర్థి ప్రకటన: కోదండరామ్‌పైనే అందరి చూపు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: వరంగల్ జిల్లా పరకాల శానససభ నియోజకవర్గం అభ్యర్థిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బుధవారం ప్రకటించింది. పరకాలకు బిక్షపతిని తమ అభ్యర్థిగా తెరాస అధికారికంగా ప్రకటించింది. బిజెపి కూడా పోటీకి సిద్ధమవుతుండడంతో ఈ రెండు పార్టీల్లో తెలంగాణ రాజకీయ జెఎసి ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఇదే సమయంలో తెలంగాణ జెఎసి చైర్మన్‌గా కోదండరామ్‌ను దించేసి, స్వామిగౌడ్‌ను ఎక్కించాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

బిజెపి, తెరాసల తీరు పట్ల తెలంగాణ జేఏసీలోని మెజారిటీ సభ్యులు అసహనం ప్రదర్శించారని సమాచారం. ప్రతిసారీ తమపైనే కత్తిపెడితే ఎలా అని వారు మండిపడ్డారని అంటున్నారు. రాజకీయ పార్టీల నుంచి దూరం జరిగి స్వతంత్రంగా ఎదుగుదామని జేఏసీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. అందుకు పరకాల ఉప ఎన్నికనే వేదిక చేసుకుందామని ప్రతిపాదించారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వానికే వారంతా మద్దతు పలికారు.

తమ భాగస్వామ్యపక్షాల వైఖరిని తెలంగాణ జెఎసి నాయకులు తప్పు పట్టినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారుపై ఏ దశలోనూ తమను సంప్రదించని ఆయా పార్టీల అధినాయకత్వాలు, ఓటమిపాలైతే మాత్రం నిందిస్తున్నాయని మెజారిటీ సభ్యులు అన్నట్లు తెలుస్తోంది. తెరాస, ఆ పార్టీ అధినేత కెసిఆర్ తీరుపై, పాలమూరు ఉప ఎన్నిక ఫలితంపై, పరకాల ఉప ఎన్నికలపై ఐదు గంటల పాటు స్టీరింగ్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది.

బిజెపి, తెరాస రెండు పార్టీలూ అవసరమేనని మరికొందరు వాదించారు. అదే సమయంలో జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ బలంగా ఉన్నందున తటస్థ వైఖరి కూడా సరికాదని నేతలంతా అభిప్రాయపడ్డారు. అయితే శాస్త్రీయ కారణాలు చూపకుండా ఏదో ఒక భాగస్వామ్య పార్టీకి మద్దతు ప్రకటిస్తే విమర్శలు వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, మెజార్టీ ప్రజలు కోరుకున్న పార్టీకే మద్దతు ఇవ్వాలని తుదకు జేఏసీ నిర్ణయించింది. ఆ పార్టీ ఏదో ఖరారు చేయటానికి జేఏసీ తరఫున ఒక కమిటీని వేయాలని తీర్మానించారు.

English summary
Telangana Rastra Samithi has announced its candiadte for Parkal assembly segment of Warangal district. As two Telangana parties hace decided to be in fray, The Telangana JAC facing triouble in extending support. Telangana JAC members supported Kodandaram leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X