అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ కుటుంబం సజీవదహనం కేసులో ఉరిశిక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantapur Map
అనంతపురం: నలుగురి సజీవ దహనం కేసుకు సంబంధించి అనంతపురం అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. అనంత జిల్లా బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్ల గ్రామంలో ఈడిగ మంజునాథ్ అలియాస్ మంజు నలుగురిని సజీవ దహనం చేశాడు. 2011 మార్చి 11వ తేది రాత్రి పదకొండు గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది

ఈ కేసు విచారణను చేపట్టిన న్యాయస్థానం 41 మంది సాక్షులను విచారించింది. ప్రాసిక్యూషన్ సి.రఘురామిరెడ్డి వాదనతో ఏకీభవించిన అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి విజయ కుమార్ నిందితుడు మంజునాథ్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్న మంజునాథ్ ఆస్తి తగాదాలో ఆమె కుటుంబాన్ని హతమార్చాడు.

పొడరాళ్ల గ్రామానికి చెందిన మంజూనాథ్ అదే గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్తి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆమెను హతమార్చేందుకు మంజునాథ్ పథకం పన్నాడు. గత సంవత్సరం మార్చి 11న రాత్రి ఆమె తల్లిదండ్రులు, కుమారుడు, మేనకోడలుతో కలిసి నిద్రిస్తుండగా వారి ఇంటి బయట వాకిలికి తాళం వేసి ఇంటి పైనున్న గవాక్షం నుంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

ఆ సమయంలో ఇంటిలో ఉన్న సుబ్బలక్ష్మితో పాటు తల్లిదండ్రులు, కుమారుడు శ్రీకాంత్ మృతి చెందారు. సుబ్బలక్ష్మి మేనకోడలు అపర్ణ మాత్రమే ప్రాణాలతో బయటపడింది. నలుగురూ మృతి చెందారు. మంజునాథ్ ఘాతుకానికి ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేయగా.. ఏడాది పాటు కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు మంజూనాథ్‌పై నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష విధిస్తూ అనంతపురం సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.

English summary

 A daily wage labourer was awarded death sentence by the district sessions court here on Tuesday for burning to death four members of a family. The court ordered that Edige Manjunath be hanged till his death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X