వైయస్ జగన్‌పై టిడిపి, కాంగ్రెసు నాయకుల ఫైర్

వైయస్ జగన్ అక్రమ నిధులను వైఎస్ఆర్ ఫౌండేషన్‌కు మళ్లించారని, ఆ సంస్థలను సీబీఐ సీజ్ చేయాలని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వర్‌రావు డిమాండ్ చే శారు. సోమవారం ఉదయం ప్రకాశం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ జైలుకెళ్లక తప్పదని, కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెస్ విలీనం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్‌కు ఎన్నికల్లో పోటీ చేసే నైతిక అర్హత లేదని దేవినేని వ్యాఖ్యానించారు.
వైయస్ జగన్ కంపెనీలకు అవినీతి సొమ్ములు వెళ్లడానికి సంతకాలు పెట్టిన ప్రస్తుత హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆ ఆస్తుల జప్తునకు సంతకాలు పెట్టడం విడ్డూరమని తెలుగుదేశం నాయకులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సోమవారం హైదరాబాదులో అన్నారు. అప్పటి ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావును కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయోజనాలు పొందిన పారిశ్రామికవేత్తలు జగన్ కంపెనీల్లో 75 శాతం, కెవిపి కుమారుడి కంపెనీల్లో 25 శాతం పెట్టుబడులు పెట్టారని వారు ఆరోపించారు. కాంగ్రెసులో ఉన్నందుకే కెవిపిని విడిచిపెట్టారని వారు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా జగన్‌పై దూకుడు పెంచారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపలేదని, వైయస్ జగన్ చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెసును ఓడించడానికి ప్రయత్నించారని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఢిల్లీలో విమర్శించారు. వైయస్ జగన్ బిజెపితో చేతులు కలుపుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని ఆమె అన్నారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెసు గెలుస్తుందని ఆమె అన్నారు
వైయస్ జగన్‌కు ఏ విషయం మీద కూడా అవగాహన లేదని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి అన్నారు. బిజెపితో జగన్ చేతులు కలుపుతున్నారని, జగన్‌కు మైనారటీల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్రెడిట్ వైయస్ రాజశేఖర రెడ్డిది కాదని, కాంగ్రెసుదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్‌ను మఖ్యమంత్రిని చేయాలని సంతకాలు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసు జెండా, ఎజెండానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా, ఎజెండాగా చేసుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications