అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడోసారి ప్రమాదం నుంచి బయటపడిన ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

For the third time, MLA cheats death
బెంగళూర్: కర్ణాటక శాసనసభ్యుడు ఒకరు మంగళవారం ఉదయం అనంతపురం జిల్లాలో జరిగిన హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇలా ప్రమాదం నుంచి బయటపడడం ఆయకు ఇది మూడోసారి అమరెగౌడ లిగంనగౌడ బయ్యపూర్ అనే కర్ణాటక శాసనసభ్యుడు పెనుకొండ వద్ద జరిగిన రైలు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయటపడ్డారు. ఆయన తన భార్య శశికళ బయ్యపూర్‌, కొంత మంది దినసరి కూలీలతో ఈ రైలులో ప్రయాణించారు. దీంతో కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఆందోళన చోటు చేసుకుంది.

తాము సురక్షితంగా ఉన్నామని శాసనసభ్యుడు ఫోన్ చేసి తన అనుచరులకు సమాచారం అందించారు. దీంతో వారు ఊరట చెందారు. ఆయన ఉదయం ఎనిమిదిన్నరకు కొప్పల్ వద్ద రైలు ఎక్కారు. ఆయన ఇంజిన్ నుంచి నాలుగో ఎసి కోచ్‌లో ప్రయాణం చేశారు. తనకు నిద్రలో పెద్ద శబ్దం వినిపించిందని, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురికావడం చూశానని ఆయన ఓ పత్రికతో చెప్పారు. సహాయక బృందాలు వచ్చే వరకు తాము బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని ఆయన చెప్పారు

సహాయ బృందాలు అరగంటలో వచ్చాయని, బోగీల నుంచి పది శవాలను వెలికి తీశారని ఆయన చెప్పారు. చిమ్మచీకటి అలుముకుందని, తాను ఏం చేయాలో అర్థం కాలేదని ఆయన చెప్పారు. ఆరు గంటల వరకు తాను, తన భార్య నిరీక్షించాల్సి వచ్చిందని, ఆ తర్వాత టాక్సీలో బెంగళూర్ చేరుకున్నామని ఆయన వివరించారు.

ఇలా ఆ శాసనసభ్యుడు ప్రమాదం నుంచి బయటపడడం ఇది మూడోసారి. రెండేళ్ల క్రితం డిప్యూటీ సిఎం ఎంపి ప్రకాష్‌తో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. వాతావరణం అనకూలించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. హెలికాప్టర్ కనిపించడం లేదంటూ గగ్గోలు మొదలైంది. ఏడాది క్రితం శాసనసభ్యులు అధ్యయన పర్యటన కోసం ప్రైవేట్ విమానం పంజాబ్‌లో జలంధర్‌లో అదుపు తప్పింది. ఈ సమయంలో ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఉన్నారు.

English summary
The news of the Hampi Express train accident left his supporters and residents of the taluk tense as the Congress legislator, his wife Shashikala Bayyapur, former legislator Hasansaab Dootihala and a few daily-wage workers from the taluk were travelling in the train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X