వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌లో ఆందోళనే ఎక్కువ కన్పించింది: చిరంజీవి ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖపట్నం: వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలో తండ్రి చనిపోయారన్న బాధ కంటే ముఖ్యమంత్రి కుర్చీ జారీపోతుందన్న ఆందోళనే ఎక్కువగా కనిపించిందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం ఎద్దేవా చేశారు. ఆయన విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు నీతికి, అవినీతికి నడుమ సాగుతున్న పోరాటంగా అభివర్ణించారు.

నాలుగైదేళ్లలో పోగేసిన అక్రమార్జనను కాపాడుకోవడానికి, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో పదవి అనేది ప్రజలు దీవించి ఇచ్చేదని, బలవంతంగా లాక్కొనేది కాదని వివరించారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న ఆక్రోశంతోనే జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేశారని చిరంజీవి ఆరోపించారు. ఈ పదవిని కట్టబెట్టి ఉంటే పార్టీ పెట్టేవారా? అని నిలదీశారు.

ముప్ఫై ఏళ్లపాటు కష్టపడి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఎదిగారని, అందుకు కారణమైన సోనియా గాంధీని దేవతగా ఆయన అభివర్ణించేవారని గుర్తు చేశారు. కానీ సిఎం పదవి కట్టబెట్టనందుకు ఆయన కడుపున పుట్టిన కొడుకు సోనియాను దెయ్యంగా, కాంగ్రెస్‌ను దుష్టపార్టీగా విమర్శించడాన్ని తప్పుబట్టారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన పత్రిక, చానల్ ద్వారా ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని చిరంజీవి ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు అనుమానం కలిగే విధంగా విష ప్రచారానికి దిగారని తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. అటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌లో తనలాంటి నాయకులు ఎందరో ఉన్నారని స్పష్టం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునూ చిరంజీవి దునుమాడారు. చంద్రబాబు అధికారం చేపడితే ప్రజలకు కష్టాలు ఫ్రీగా లభిస్తాయని ఎద్దేవా చేశారు. ఆయన పాలనలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే తుపాకులతో కాల్పించారని గుర్తుచేశారు. అధికార దాహంగల చంద్రబాబు, వ్యక్తిగత స్వార్థం కలిగిన జగన్.. కాంగ్రెస్‌కు దీటుగా నిలవలేరన్నారు.

English summary

 Rajyasabha Member Chiranjeevi lashed out at YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy on Saturday in Vishakapatnam bypolls campaign. He said, Jagan earned lacks of rupees at the time of late YS Rajasekhar Reddy regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X