కోర్టు నిర్ణయంతో ఏడ్చేసిన విజయమ్మ, భారతి

YS Vijayamma
హైదరాబాద్: తన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్నోహన్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాడ్ విధిస్తూ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించగానే వైయస్ విజయమ్మ ఏడ్చేశారు. ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా నిలువరించుకునే ప్రయత్నం చేశారు. వైయస్ జగన్ సతీమణి భారతీరెడ్డి కూడా కంటతడి పెట్టారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.

వైయస్ జగన్‌కు జూన్ 11వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. దీంతో వైయస్ విజయమ్మ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. కళ్ల నుంచి నీరు ఉబికి వస్తుంటే నిలువరించుకునే ప్రయత్నం చేశారు. పక్కన ఉన్న బంధువులు, సన్నిహితులు ఆమెను ఊరడించే ప్రయత్నం చేశారు.

వైయస్ జగన్‌ను సిబిఐ అధికారులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. తన కుమారుడిని అరెస్టు చేశారనే వార్త విన్న వెంటనే విజయమ్మ తన కోడలు భారతి, కూతురు షర్మిలలతో కలిసి దిల్‌కుషా అతిథి గృహానికి చేరుకున్నారు. దిల్‌కుషా అతిథి గృహం వద్ద ప్లాట్‌ఫారం మీద బైఠాయించారు. అక్కడి నుంచి వారిని పోలీసులు ఇంటికి తరలించారు. ఇంటి వద్ద వారు సోమవారం ఉదయం వరకు బైఠాయించారు. ఆ తర్వాత దిల్‌కుషాకు వచ్చి భారతి రెడ్డి జగన్‌ను కలిశారు.

ఇప్పటి వరకు ఉప ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా తిరిగిన వైయస్ జగన్ ఉప ఎన్నికలు జరిగే వరకు ప్రచారంలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. జూన్ 11వ తేదీ వరకు కోర్టు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జూన్ 12వ తేదీన రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి పోలింగ్ జరగనుంది. జూన్ 15వ తేదీ ఫలితాలు వెలువడుతాయి. ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే కాంగ్రెసు పెద్దలు కుట్ర చేసి జగన్‌ను సిబిఐ చేత అరెస్టు చేయించారని విజయమ్మతో సహా పార్టీ నాయకులంతా ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+