జగన్ సహా అందరినీ ప్రశ్నిస్తాం!: ఈడి, జైలుకు మోపిదేవి

YS Jagan-Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసి కేసులలో జైలులో ఉన్న నిందితులను విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వండని ఈడి(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) బుధవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడి పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. విచారణకు అనుమతించవద్దని జగన్ ఆస్తుల కేసు, ఓఎంసి, ఎమ్మార్ తరఫు న్యాయవాదులు వాదించారు. కోర్టు విచారణను వాయిదా వేసింది.

ఈడి పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అంతకుముందు దిల్ కుషా అతిథి గృహంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతనిని కోర్టుకు తరలించారు. కోర్టు మోపిదేవికి 7వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

తనకు బెయిల్ ఇవ్వాలని మోపిదేవి వెంకటరమణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పైన విచారణను గురువారానికి వాయిదా వేశారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలంటూ మరో పిటిషన్ మోపిదేవి దాఖలు చేశారు. అందుకు కోర్టు అంగీకరించింది. మోపిదేవిని జైలులో ప్రత్యేక ఖైదీగా గుర్తించనున్నారు.

కాగా మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు ఈ నెల 24న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేటితో మోపిదేవి సిబిఐ కస్టడీ ముగిసింది. ఇటీవల స్వల్పంగా అనారోగ్యానికి గురి కావడంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఇప్పుడు అతనిని కోర్టులో హాజరుపర్చారు. మళ్లీ మోపిదేవి కస్టడీకి సిబిఐ పిటిషన్ దాఖలు చేయలేదు. జైలులో మోపిదేవికి అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 6113 కేటాయించారు.

తాను నిబంధనల మేరకే అనుమతులు ఇచ్చానని మోపిదేవి తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు. వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైళ్లను సిబిఐ సీజ్ చేసిందని తెలిపారు. తొమ్మిది నెలలుగా సిబిఐ విచారణకు సహకరిస్తున్నట్లు చెప్పారు. తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, బెయిల్ ఇప్పించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+