రాజీనామా, జగన్ పార్టీలోకి ఎమ్మెల్యే రంగారావు

Ranga Rao
విజయనగరం: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ వెంకట రంగారావు బుధవారం తన శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తొలి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పట్టున్న ఈ జిల్లా నుంచి ఓ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైరివర్గంలో చేరడం ఇదే ప్రథమం. దీనితో జిల్లాలో రాజకీయ సమీరకణాలు మారే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే బొత్స కుటుంబ హవా నేపథ్యంలో రంగారావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.దీనితో అసంతృప్తితో ఉన్న రంగారావు కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు.

రంగారావు ఇటీవల హైదరాబాదు వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. వైయస్ జగన్‌ సిబిఐ విచారణకు హాజరైన నేపథ్యంలో వైయస్ విజయమ్మతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాను జగన్‌కు సంఘీభావం తెలియజేయడానికి మాత్రమే వచ్చానని ఆయన అప్పట్లో చెప్పారు.

అంతకు ముందు కాంగ్రెసు ఏలూరు శానససభ్యుడు ఆళ్లనాని వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయనకు కాంగ్రెసు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆళ్ల నాని ఆ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. కాగా, విజయనగరం జిల్లా నుంచి మరో ఇద్దరు శాసనసభ్యులు కాంగ్రెసు నుంచి వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+