జగన్‌నే కాదు, బాబునూ జైలుకు పంపేవాళ్లం: కిరణ్ రెడ్డి

Kiran Kumar Reddy
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే కొందరు దానిని త్యాగమని చెబుతున్నారని, ఆయన ఏనాడైనా రైతుల కోసం పోరాడిన వ్యక్తా అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయన రైతుల కోసం పోరాడాడా, కార్మిక, కర్షక, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని పోరాడి జైలుకు వెళ్లాడా, లేదా వేల కోట్ల అక్రమ సంపాదనతో కంపెనీలు పెట్టినందుకు వెళ్లాడా అని ద్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీతో కలిసి, రాష్ట్రాన్ని రెండు భాగాలుగా చేయాలని చూస్తున్న టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోనూ, బిజెపితోను చేతులు కలిపి కుట్రతో ప్రభుత్వాన్ని పడగొట్టేలా ఓట్లు వేస్తే దీన్ని కూడా త్యాగం అంటారా అంటూ ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా ఖూనీగా చిత్రీకరించేంత నీచానికి దిగజారుతారా అంటూ వైయస్ విజయలక్ష్మిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. తమకు ఎవరి మీద కక్ష లేదని, అదే ఉంటే చంద్రబాబు నాయుడును సైతం జైలుకు పంపించి ఉండేవాళ్లమేమో అన్నారు.

జగన్ అరెస్టుతో ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు సంబంధం లేదని చెప్పారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు విషయంలో జగన్ హస్తం ఉందన్నారు. ఆయన అప్పటి సిఎం ఆదేశాల మేరకే సంతకం చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు, కంపెనీలు మీవి.. అరెస్టయ్యేది మాత్రం మంత్రులా అంటూ నిలదీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్ని జగన్‌ను అరెస్టు చేయించాయంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

సోనియా గాంధీ దేవత అని, నిస్వార్థపరురాలని వైయస్ ఆనాడు కీర్తిస్తే ఇప్పుడు ఆయన కుటుంబం ఆమెపై నిందలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కుర్చీపై మీకు ఆశ ఉండొచ్చునని, వైయస్‌కి ఈ విషయంలో 30 సంవత్సరాల సమయం పట్టిందన్నారు. అయితే కాంగ్రెస్సే ఈ అవకాశాన్ని ఆయనకిచ్చిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఆనాడు రాజశేఖర రెడ్డి దురదృష్టవశాత్తు చనిపోతే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రధాని స్వయంగా వచ్చి విజయలక్ష్మిని ఓదార్చారని, కనీసం ఆపాటి కృతజ్ఞత కూడా వీళ్లకు లేదని దుయ్యబట్టారు.

వైయస్ పేరుతో ఓట్లు దండుకోవాలని వస్తున్న వారి విషయంలో ఒకసారి ఆలోచించాలని, వైయస్ బతికుంటే ఆయన ఏ పార్టీలో ఉండేవారో ఆలోచించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లపాటు వైయస్ సిఎంగా ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? పేదలు, ఎస్సీ, ఎస్టీల గురించి ఏనాడైనా మాట్లాడారా, మత్స్యకారులకు ఏదైనా చేయాలని చెప్పారా, చెప్పలేదే, అప్పట్లో కంపెనీలు తెరవడం, డబ్బు జమచేయడం.. ఇదేగా మీరు చేసిందంటూ జగన్‌ను ఉద్దేశించి విమర్శల వర్షం కురిపించారు.

అలాగే చంద్రబాబుపై కూడా ఆయన మండిపడ్డారు. బాబుకు, జగన్‌కు తేడా లేదని, ఒక పార్టీగానీ, వ్యక్తిగానీ మేలు చేస్తే వారికి రుణపడి ఉంటారని, కానీ చంద్రబాబు, జగన్‌లకు కావల్సిందల్లా సిఎం కుర్చీయే అన్నారు. సిఎం కుర్చీ కోసం ఇన్ని అసత్యాలు.. ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నాలా అంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+