గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారాచౌదరి కేసులో రాయపాటికి బెదిరింపు మెసేజ్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
గుంటూరు: ఉద్యోగాలు, సినీ అవకాశాల పేరిట అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపిన ఆరోపణలతో జైలుకెళ్లి ఇటీవలె బెయిల్ పైన విడుదలయిన తారా చౌదరి కేసుకు సంబంధించి గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావుకు బెదిరింపు ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. ఈ విషయంపై ఆయన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తారా చౌదరి కేసుకు సంబంధించి తనకు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని రాయపాటి చెప్పారు.

తారా చౌదరికి, మీకు సంబంధించిన ఆడియో, వీడియో సిడిలు తమ దగ్గర ఉన్నాయని, తనను కలిస్తే వాటిని అప్పగిస్తానని, ఈ నెంబర్‌కు తిరిగి ఫోన్ చేయొద్దని, చేసినా... అది పని చేయదని రాయపాటి సాంబశివ రావు సెల్‌ఫోన్‌కు వచ్చిన సారాంశమట. ఒకటీ రెండు కాదూ... పదే పదే అదే ఎస్సెమ్మెస్‌లు వచ్చాయని తెలుస్తోంది. 7306727667 అనే నెంబర్ నుంచి ఈ మెసేజ్‌లు వచ్చినట్లుగా సమాచారం.

నాలుగు రోజుల క్రితం ఎంపి రాయపాటి లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కన్యకాపరమేశ్వరీ గుడికి వెళ్లిన సమయంలో ఈ ఎస్సెమ్మెస్ వచ్చింది. దీనిని ఆయన అక్కడే ఉన్న సిఐ రామాంజనేయులు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అర్బన్ ఎస్పీ రవికృష్ణను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై సిఐ రామాంజనేయులు కోర్టు అనుమతి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఇప్పటికే తారా చౌదరి కేసులో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని రాయపాటి ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఎస్సెమ్మెస్‌లు రావడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. బెదిరింపు మెసేజ్ వచ్చిన సెల్ నెంబర్ ఎవరిదనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. తనకు ఇటీవల బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నందునే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాయపాటి తెలిపారు. తారా టేపులలో ఉన్నది తన వాయిస్ కాదని, ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలంటే విచారణ చేసుకోవచ్చునని రాయపాటి చెప్పారు.

English summary
Guntur MP Rayapati Sambasiva Rao received threat messages from unknown person in Tara Choudhary case. He complainted against this message in Lalapet police station of Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X