హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా వాణికి అవకాశమివ్వండి: హైకోర్టులో జగన్ పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఉప ఎన్నికల సందర్భంగా తమ వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ వాణిని వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. రాజ్యాంగ అధికరణ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించాలని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అండర్ ట్రయల్‌గా ఉన్నా తనకు మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జైళ్ళ శాఖ డిజి, ఐజి, డిఐజిలను జగన్ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారానికి అనుమతివ్వాలని కోరారు. కాగా అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ గత నెల 27న తేదిన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 28వ తేదిన అతనిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చింది.

కోర్టు జగన్‌కు పదకొండవ తేది వరకు రిమాండ్ విధించింది. జగన్ బెయిల్ కోసం, సిబిఐ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించారు. జగన్ బెయిల్ పిటిషన్ కొట్టి వేసిన కోర్టు.. సిబిఐ కస్టడీకి అతనిని ఐదు రోజుల పాటు అప్పగించింది. సిబిఐ ఆదివారం నుండి అతనిని విచారిస్తోంది. బుధవారం నాలుగో రోజు. గురువారంతో జగన్ కస్టడీ ముగుస్తోంది. సిబిఐ మళ్లీ ఆయన కస్టడీని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) రంగంలోకి దిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులో సిబిఐ దాఖలు చేసిన రెండో, మూడో ఛార్జీషీట్లు, ఎమ్మార్ ఛార్జీషీట్లు ఇవ్వాలని కోరింది. ఈడి పిటిషన్ స్వీకరించిన నాంపల్లి కోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

కాగా తాను తిరుపతి, షిర్డీ వెళ్లేందుకు ఆరు రోజుల పాటు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బుధవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయ సాయి రెడ్డికి బెయిల్ ఇచ్చిన సమయంలో హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy filed a petition in High Court on Wednesday. He urged in his petition to allow his bypolls campaign through electronic and print media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X