వైయస్ జగన్ కస్టడీకి పిటిషన్: సిబిఐకి చుక్కెదురు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరో మూడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ లంచ్ మోషన్‌గా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. వైయస్ జగన్‌ను ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఇది వరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ సిబిఐ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగుస్తోంది. ఈ స్థితిలో మరో మూడు రోజుల పాటు జగన్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ లంచ్ మోషన్‌గా సిబిఐ గురువారం పిటిషన్ దాఖలు చేసింది.

జగన్‌ కస్టడీని కోరుతూ మరో రూపంలో రావాలని హైకోర్టు సిబిఐకి సూచించింది. దీంతో సిబిఐ రేపు శుక్రవారం జగన్ కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించామని, దాన్ని పొడగించాలని కోరుతూ ఇంత త్వరగా లంచ్ మోషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు సిబిఐని ఉద్దేశించి అన్నది.

వైయస్ జగన్‌ను సిబిఐ వరుసగా ఐదు రోజుల పాటు విచారించింది. జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు వచ్చిన తీరుపై, ఇతరత్రా వ్యవహారాలపై సిబిఐ అధికారులు జగన్‌ను ప్రశ్నించారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి మాత్రమే బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే ఆయన ప్రతి రోజూ సిబిఐ విచారణకు హాజరవుతున్నారు.

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డి జైలులోనే ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని మూడు రోజుల పాటు విచారించిన తర్వాత సిబిఐ మే 27వ తేదీన అరెస్టు చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో గురువారం మంత్రి పొన్నాల లక్ష్మయ్యను, ఐఎఎస్ అధికారి అదిత్యానాధన్‌ను కూడా సిబిఐ విచారణ నిమిత్తం పిలిచింది. జననీ ఇన్‌ఫ్రా డైరెక్టర్, కాకినాడ శానససభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+