ప్రభుత్వ భవనం వద్దన్న సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా తనకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తిరస్కరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయబోనని తేల్చి చెప్పారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో ప్రభుత్వం తనకు కేటాయించిన నివాస భవనాన్ని ఆయన తిరస్తరించారు. కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ నివాసం ఎదురుగానే సచిన్ టెండూల్కర్‌కు ప్రభుత్వం నివాస భవనాన్ని కేటాయించింది.

భవనం తీసుకోవడం పన్నులు చెల్లించిన ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడ్డారు. "నాకు ప్రభుత్వం కేటాయించిన భవనంలో నివసించలేను. నేను ఢిల్లీలో కొద్ది రోజులు మాత్రమే ఉండొచ్చు. ఇది పన్నులు చెల్లించిన ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడమే. నివాస వసతి అవసరమైన మరొకరి ఆ బంగ్లా కేటాయిస్తే సంతోషిస్తాను.''అని సచిన్ సీఎన్ఎన్- ఐబీఎన్ ప్రతినిధితో అన్నారు. పార్లమెంటు సమావేశాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి తాను కొద్ది రోజులు మాత్రమే ఢిల్లీలో ఉండే అవకాశం ఉందని, అందువల్ల తనకు ఢిల్లీలో ప్రభుత్వం కేటాయించే భవనం అవసరం లేదని ఆయన అన్నారు.

రాజ్యసభ సభ్యుడిగా ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ వచ్చినప్పుడు హోటల్‌లో ఉండడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. అయితే రాజ్యసభ సభ్యుని హోదాలో తన బాధ్యతలేమిటో తెలుసని, సభలో క్రీడాంశాలపై ప్రశ్నలు సంధిస్తానని లండన్ బయలుదేరే ముందు సచిన్ వెల్లడించారు.

సౌకర్యాలు పొందడానికి రాజ్యసభ సభ్యుడిని కాలేదని ఆయన చెప్పారు. సచిన్ టెండూల్కర్‌కు కేటాయించిన భవనం ఏడు వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. పెద్ద లాన్, ఐదు పడక గదులు ఉంటాయి. ప్రభుత్వ భవనం తీసుకోనంత మాత్రాన తాను బాధ్యతలను విస్మరిస్తానని అనుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+