• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెర్రీ పెళ్లికి జూ.దంపతులు, ప్రముఖులు: వైభవంగా పెళ్లి

By Srinivas
|

Ram Charan-Upasana
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - ఉపాసనల వివాహానికి గురువారం ఉదయం సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. గండిపేట టెంపుల్ టీ ఫామ్ హౌస్‌లో వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పెళ్లి మంటపం కళకళలాడుతోంది. ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే లోనికి అనుమతించారు. బాలీవుడ్, దక్షిణాది తారలు పలువురు వచ్చారు.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, బోనీ కపూర్, అంబరీష్, దాసరి నారాయణ రావు, మురళీ మోహన్, పవన్ కళ్యాణ్, నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, రాఘవేంద్ర రావు, అశ్వనీదత్, కెఎస్ రామారావు, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, వేణుమాదవ్ బ్రహ్మానందం, శ్రీకాంత్, ఊహ, రామానాయుడు, కోడి రామకృష్ణ, దగ్గుపాటి రాణా, కోట శ్రీనివాస రావు, కైకాల సత్యనారాయణ, బోయపాటి శ్రీను, సుమలత, ఎస్వీ కృష్ణా రెడ్డి తదితరులు నటీనటులు, దర్శక, నిర్మాతలు వచ్చారు.

గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సుబ్బి రామి రెడ్డి, జానా రెడ్డి, రఘువీరా రెడ్డి, డిఎల్ రవీంద్ర రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సి.రామచంద్రయ్య, వి.హనుమంత రావు, మధు యాష్కీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, హర్ష కుమార్, కెసిఆర్ తదితరులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని టెంపుల్ ట్రీ ఫాంహౌస్‌లో పూర్తి సాంప్రదాయబద్దంగా వివాహం జరుగుతోంది. ఇరువురు బంధువులు మండపానికి చేరుకున్నారు.

కాగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బుధవారమే తన ప్రత్యేక దూత ద్వారా పూల బోకే పంపించారు. ఈ పెళ్లికి వివిధ రంగాలకు చెందిన మూడువేల మందికి మాత్రమే ఆహ్వానాలు ఉన్నాయి. సాయంత్రం హైటెక్స్ లోని నోవాటెల్‌ హెటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Heros Junior NTR, Srikanth, Venkatesh, Rana, Producers Ramanaidu, Ashwanidatt, directors Boyapati Srinu, political leader Kiran Kumar Reddy, Geetha Reddy and Ponnala Laxmaiah were attended to Ram Charan tej - Upasana marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more