విద్యార్థినిపై యాసిడ్ దాడి, మృతి: స్పందించిన సిఎం

వెంటనే తలుపులు తట్టిన వారు కల్యాణిపై యాసిడ్ పోసి పరారయ్యారు. ఈ సంఘటనలో కల్యాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. అనిత మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.
అమ్మాయిపై యాసిడ్ దాడి ఘటనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బిక్కనూరు మండలం అంటంపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళుతున్న కారును కామారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ ఢీకొట్టింది. మృతులు మహారాష్ట్రకు చెందిన వారుగా భావిస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనపర్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications