టీవీ చూస్తూ ఎగిరి గంతేస్తున్న వైయస్ జగన్

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో టీవీ చూస్తున్నారు. ఆయనకు దూరదర్శన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫలితాలు తీరు చూసి వైయస్ జగన్ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తాను జైలులో ఉన్నప్పటికీ తన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడం ఆయనకు సంతోషాన్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెసు రెండు స్థానాల్లో, టిడిపి ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. తొలుత రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత కాంగ్రెసుపై వెనకబడిపోయింది. రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి వంటి స్థానాల్లో కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు గట్టి పోటీ ఇస్తోంది. రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొని ఉంది.

తెలంగాణలోని పరకాల శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. తెరాసకు సవాల్ విసిరి బరిలోకి దిగిన బిజెపి నాలుగో స్థానంలో ఉంది.

నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై 11 వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉదయగిరి శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కేవలం 405 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. నర్సాపురం, తిరుపతి స్థానాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుంది.

ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెసు పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నర్సాపురం, తిరుపతి నియోజకవర్గాల్లో కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే, తిరుపతిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. రెండో రౌండులో వెంకటరమణ 59 ఓట్ల మెజారిటీ సాధించారు.

కాగా, పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంది. చాలా చోట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్యనే పోరు కొనసాగుతోంది. ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగి రెడ్డి ఆధిక్యంలో ఉంది. రాయదుర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు ఆధిక్యంలో ఉంది.

ఎమ్మిగనూరు, రాజయంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పోలవరం, పాయకరావుపేట, మాచర్ల, ప్రత్తిపాడు, తదితర నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+