ప్రశ్నించనివ్వండి: ఈడి పిటిషన్, జగన్‌కు కోర్టు నోటీసులు

జగతి పబ్లికేషన్ కంపెనీలోకి మనీ లాండరింగ్ ద్వారా కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ఈడి అనుమానించింది. ఆ సంస్థ చైర్మన్‌గా జగన్‌ను విచారించడానికి అనుమతివ్వాలన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 50 కింద విచారించేందుకు అనుమతించాలన్నారు. తాము చంచల్‌గూడ జైలులోనే జగన్‌ను విచారిస్తామని ఈడి తన పిటిషన్‌లో పేర్కొంది. తాము విచారించినంత మాత్రాన నేరస్తులు కాదన్నారు.
మనీ ల్యాండరింగ్ చట్టనికి విరుద్ధంగా జరిగినట్లు తమ విచారణలో తేలిందని, అంతేగాక 30 లక్షల రూపాయల పరిమితి దాటితే ఆయా సంస్థల డైరెక్టర్లను తాము విచారణ జరుపుతామని ఈడి పేర్కొంది. జగతి పబ్లికేషన్ డైరెక్టర్‌గా ఉన్న జగన్మోహన్ రెడ్డి సంస్థలలో వివిధ కంపెనీలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాయని, ఈ నేపథ్యంలో జగన్‌ను విచారించాల్సిన అవసరం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ తెలిపింది. అలాగే సంతోష్ పవర్ డైరెక్టర్‌గా ఉన్న జగన్‌ను విచారంచేందుకు ఈడి నాంపట్లి కోర్టులో శనివారం మరో పిటిషన్ వేయనున్నట్లు తెలియవచ్చింది.
ఈడి పిటిషన్ పైన స్పందించిన సిబిఐ కోర్టు వైయస్ జగన్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణనను 20వ తేదికి వాయిదా వేసింది. కాగా ఈడి పిటి వారెంట్ కింద వైయస్ జగన్‌ను తమ అదుపులోకి తీసుకొని వేరే ప్రాంతంలో విచారిస్తారనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తాము చంచల్‌గూడ జైలులోనే విచారిస్తామని ఈడి చెప్పడం ద్వారా ఆ ప్రచారానికి తెరపడినట్లేనని భావించవచ్చు. కాగా తొమ్మిది నెలల నుంచి జగన్ అక్రమాస్తుల కేసును సిబిఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!